కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు: గురువారం సీఎం సిద్ధరామయ్య రాజీనామా?

  • ఢిల్లీలో ఏడు గంటల పాటు హైకమాండ్ సుదీర్ఘ చర్చలు
  • బెంగళూరులో నేటి సిద్ధరామయ్య ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ
  • హస్తినలోనే తన పర్యటనను పొడిగించుకున్న డీకే శివకుమార్
  • గురువారం ఉదయం సీఎం నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్
  • సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు మంత్రి పదవి?
కర్ణాటక రాజకీయ ముఖచిత్రం మరోసారి భారీ మార్పునకు లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానంతో ఢిల్లీలో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (28న) తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో, బుధవారం బెంగళూరులో సిద్ధరామయ్య ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం అందడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాల నడుమ ఈ ప్రెస్‌మీట్‌ను అందరూ నిశితంగా గమనిస్తున్నారు.  కాగా, సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా ఉందని కూడా సమాచారం.

మరోవైపు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను పొడిగించుకున్నారు. అయితే, రేపు (గురువారం) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ హై-వోల్టేజ్ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే, తాము కేవలం రాజ్యసభ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల గురించే చర్చించామని కాంగ్రెస్ పార్టీ పైకి చెబుతున్నప్పటికీ, లోపల మాత్రం నాయకత్వ మార్పుపైనే ప్రధానంగా చర్చ సాగినట్లు పొలిటికల్ వర్గాల సమాచారం.

Siddaramaiah
Karnataka politics
DK Shivakumar
Congress party
Karnataka CM
Yatindra Siddaramaiah
Rahul Gandhi
Mallikarjun Kharge
Karnataka government
Leadership change

More Telugu News